పెళ్లి రోజున కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే?

17 Aug, 2022 17:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పిఠాపురం(కాకినాడ జిల్లా): పెళ్లి రోజున కొత్త చీర కొనలేదనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన మల్లిపూడి శ్రీనివాసరావుకు శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన పద్మినితో 2017లో వివాహమైంది. ఈ నెల 11న చేలో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన భర్తను పెళ్లి రోజు, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చీర కొనాలని పద్మిని అడిగింది.
చదవండి: ఇంటి యజమానితో భార్య వివాహేతర బంధం..

ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉందని, తాను ఇప్పుడు కొనలేనని అతడు సమాధానం చెప్పాడు. తోటి వారందరూ వరలక్ష్మీ వ్రతానికి కొత్త చీరలు కొనుక్కుంటున్నారని.. ఆ రోజు పెళ్లి రోజు కూడా అయినందున తనకు చీర కొనాలని కోరింది. ఈ నేపథ్యంలో దంపతులిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న పద్మిని చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. విషయం గమనించిన భర్త కేకలు వేయగా.. బంధువులు, స్థానికులు పరుగున వచ్చి ఆమెను కిందకు దింపారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు