ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్‌ మెసేజ్‌ పెట్టాడని..

21 Apr, 2022 09:36 IST|Sakshi

కాకినాడ రూరల్‌: రమణయ్యపేట గ్రామ పరిధి గైగోలుపాడు గంజావారి వీధికి చెందిన ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. సర్పవరం పోలీసుల కథనం ప్రకారం.. గైగోలుపాడుకు చెందిన సూరంపూడి దుర్గాప్రసాద్‌ బుధవారం వాసంశెట్టి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. గతంలో వీరి కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేవి. బుధవారం మధ్యాహ్నం దుర్గాప్రసాద్‌ భార్యకు నాగేశ్వరరావు ఏం చేస్తున్నావని వాయిస్‌ మెసేజ్‌ పెట్టడం హత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..?

మెసేజ్‌ చూసిన దుర్గాప్రసాద్‌కు కోపం రావడంతో పాటు తన భార్యతో వివాహేతర సంబంధం ఉండవచ్చని అనుమానించి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఇనుప నీటి గొట్టంతో దాడి చేశాడు. తలపై బలమైన గాయాలవ్వడంతో నాగేశ్వరరావును స్థానికులు జీజీహెచ్‌లో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వదిన రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్‌.సురేష్‌బాబు తెలిపారు. కేసును సీఐ మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు