డీఎ‍స్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్‌

7 Dec, 2020 09:18 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బెట్టింగ్‌ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీశ్‌, ఎస్సై గోవింద్‌ డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని కూడా విచారించారు. అయితే బెట్టింగ్‌ కేసులో లక్ష్మీ నారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ, ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ విచారణ చేపట్టింది. దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిచించారు.

చదవండి: ఎస్‌ఐ గోవింద్‌పై సస్పెన్షన్‌ వేటు
చదవండి: కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ గుబులు!

మరిన్ని వార్తలు