Kamareddy: పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కన్న కొద్దిసేపటికే బావిలో దూకి..

1 Sep, 2021 12:31 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: అప్పుడే పుట్టిన శిశువును ముళ్ళ పొదల్లో వేసి, ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. బావిలో దూకి ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్మల్ తండాలో  చోటుచేసుకుంది. గ్రామంలోని దుర్గం చెరువు వద్ద ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువు లభ్యమైంది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న గాంధారి ఎస్సై, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సరస్వతి శిశువును కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

నవజాత శిశువును పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ శిశువును అబ్జర్వేషన్‌లో ఉంచారు.  తండా వాసులు ఇచ్చిన సమాచారం ప్రకారం శిశువు తల్లి అవివాహిత కావడంతో పసికందును ముళ్లపొదల్లో వదిలేసి అమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు