కొడుకు ప్రేమ పెళ్లి.. మానసికంగా కుంగిపోయిన తల్లి.. చివరికి

4 Feb, 2022 18:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కామారెడ్డి:  కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. పట్టణంలోని హరిజనవాడ కాలనీకి చెంది బుంది గంగయ్యది వ్యవసాయ కుటుంబం. అతనికి భార్య గంగవ్వ (42) కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తరుణ్‌ కొద్దిరోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లా మోస్రాకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గంగవ్వ మానసికంగా కుంగిపోతోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసుదన్‌గౌడ్‌ తెలిపారు. 
చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని..

మరిన్ని వార్తలు