రెచ్చిపోయి మరీ ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. సస్పెన్షన్‌ వేటు

20 Aug, 2022 12:47 IST|Sakshi

లక్నో: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు అధికారులు. 

ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు అజయ్‌ గుప్తా అనే కానిస్టేబుల్‌.  ప్రధాని నరేంద్ర మోదీపై, ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై అసభ్యకరమైన ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతని ట్వీట్లు స్క్రీన్‌ షాట్ల రూపంలో బాగా వైరల్‌ అయ్యాయి. అలా విషయం ఉన్నతాధికారుల దృష్టితో వెళ్లింది. దీంతో అతన్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు. 

ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు సందర్భంగా పోలీస్‌ మెడల్‌ కోసం తన పైస్థాయి అధికారుల నుంచి డీజీపీ కార్యాలయం స్థాయి వరకు నిలదీస్తూ ట్విటర్‌లో పోస్టులు చేశాడు అజయ్‌ గుప్తా. ఈ క్రమంలో అతని పాత ట్వీట్ల బండారం బయటపడింది. దీంతో అతను తన అకౌంట్‌ను డిలీట్‌ చేయగా.. అప్పటికే అభ్యంతకర ట్వీట్ల స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అయ్యాయి. 

‘‘ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అతను చేసిన కొన్ని పోస్టులు మరీ మితిమీరి ఉన్నాయి. పోలీస్‌ సిబ్బంది అనే స్పృహ లేకుండా పోస్టులు చేశాడు. ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే. డిపార్టమెంటల్‌ ఎంక్వైరీకి ఆదేశించాం అని పోలీస్‌ కమిషనర్‌ బీపీ జోగ్‌దంద్‌ తెలిపారు.

ఇదీ చదవండి: తాగొద్దు అన్నందుకు ఇంటి ఓనర్‌ హత్య.. ఆపై సెల్ఫీ!!

మరిన్ని వార్తలు