పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయిని బెదిరించిన ఆకతాయి

28 Nov, 2022 10:42 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో 17 ఏళ్ల అమ్మాయిని బెదిరించాడు ఓ యువకుడు. పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో ముక్కలు ముక్కలుగా నరికేస్తానని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్టు చేశారు. 

ఈ ఆకతాయి పేరు ఫయాజ్. చాలా కాలంగా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఆమె స్కూల్‌కు వెళ్లే సమయంలో వెంటపడి తరచూ ఇబ్బందిపెడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వాళ్లు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ అతని బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. చివరకు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు ప్రపోజ్ చేశాడు.

‍అయితే అమ్మాయి అందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫయాజ్‌ ఆమెను భయపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ముక్కలు ముక్కలుగా నరికేస్తానని బెదిరించాడు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులను అశ్రయించారు.

ఫిర్యాదు అనంతరం పోలీసులు ఫయాజ్‌ ఇంటికి వెళ్లగా.. కుటుంబసభ్యులు వాళ్లతో గొడవకు దిగారు. పలితంగా మరికొంత మంది పోలీసులను పిలిపించి అధికారులు ఫయాజ్‍ను అరెస్టు చేశారు. అతడిపై అక్టోబర్ 16న పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు తెలిపారు.
చదవండి: కోటిన్నర నగలు కొట్టేశారు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు