కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

26 Nov, 2021 09:16 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి కరీంనగర్‌ వెళ్తున్న కారు మానకొండూరు పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకరికి తీవ్ర గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు కరీంనగర్‌లోని జ్యోతినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: తెలంగాణలోనూ ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం పెట్టండి: నిర్మాత

కారులో ప్రయాణిస్తున్న కొప్పుల శ్రీనివాస రావు, కొప్పుల బాలాజీ శ్రీధర్‌, ఇందూరి జలంధర్, శ్రీరాజు మృతి చెందగా.. మరో వ్యక్తి పెంచాల సుధాకర్ రావుకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే నిద్రమత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు

మరిన్ని వార్తలు