బకెట్‌లో పడి మృత్యు ఒడికి చిన్నారి

19 Jun, 2021 14:06 IST|Sakshi
బకెట్‌లో పడి మృతి చెందిన బాలుడు సమర్థ (ఫైల్‌ఫోటో)

మైసూరు: బకెట్‌లో పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం జిల్లాలోని హుణసూరు తాలూకా తరికళ్లు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుందర్‌రాజ్‌ కుమారుడు సమర్థ(2) శుక్రవారం మధ్యాహ్నం బుడి బుడి అడుగులు వేసుకుంటూ బాత్‌రూంలోకి వెళ్లి బకెట్‌లోకి తొంగిచూసి నీటిలోకి తలకిందులుగా పడిపోయాడు. కొంతసేపటికీ ఇంట్లోని వారు బాలుడి కోసం గాలించి బాత్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా అప్పటికే ప్రాణాలు విడిచాడు.   
 

మరిన్ని వార్తలు