టాటా చెప్పి వెళ్లొస్తా మమ్మీ అని.. చివరికి తండ్రి ముందే

17 Aug, 2023 12:42 IST|Sakshi

బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో ఘోరం జరిగింది. బీఎంటీసీ బస్సు మృత్యుశకటమై నాలుగు సంవత్సరాల బాలికను బలిగొంది. ఈ విషాద ఘటన కుమారస్వామిలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. ఉత్తరహళ్లి నివాసి ప్రసన్న సిస్కో కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె పూర్వీరావ్‌ బెంగళూరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ప్రీకేజీ చదువుతోంది.

బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు సిద్దమైంది. తల్లికి టాటా చెప్పి, వెళ్లోస్తా అని తండ్రి ప్రసన్న బైక్‌ ఎక్కింది. ఉత్తరహళ్లి మెయిన్‌రోడ్డు పద్మావతి సిల్క్‌షోరూమ్‌ వద్ద వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్‌ బైక్‌ను ఢీకొంది. తండ్రీకుమార్తె కిందపడగా చిన్నారిపై బస్సు చక్రాలు వెళ్లాయి. ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారస్వామి లేఔట్‌ ట్రాఫిక్‌ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి    వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్‌.. ప్రియుడు ఇంట్లోకి రాగానే..

మరిన్ని వార్తలు