యువతి, జార్కిహొళి గదుల్లో సిట్‌ తనిఖీలు 

2 Apr, 2021 17:04 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి విచారణలో తెలిపిన ప్రకారం సాక్ష్యాధారాల సేకరణలో సిట్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. యువతి గతంలో బసచేసిన ఆర్‌టీ నగర పీజీ (పేయింగ్‌ గెస్ట్‌) హాస్టల్‌ గదితో పాటు మల్లేశ్వరంలోని రమేశ్‌ జార్కిహొళి ఫ్లాటులో భారీ బందోబస్తు మధ్య గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. వీడియో కాల్స్, ధరించిన దుస్తులు, రికార్డింగ్‌కు ఉపయోగించి సామగ్రి కోసం గాలించారు.

యువతి ఫిర్యాదు ప్రకారం ఢిల్లీలోని కర్ణాటక భవన్‌ నుంచి రమేశ్‌ జార్కిహొళి వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. ఆ సమయంలో తాను గదిలో ఉన్నట్లు తెలిపింది.  మాజీ మంత్రి తనను లైంగికంగా వాడుకున్నాడని, బెదిరించాడని ఆరోపణలు చేయడం తెలిసిందే. ఆమె ఆరోపణల్లో నిజానిజాల నిర్ధారణ కోసం ఇద్దరి గదుల్లో సోదాలు జరిపారు. ఆమె చెప్పిన వాటికి కచ్చితమైన సాక్ష్యాలు లభిస్తే రమేశ్‌ జార్కిహొళిని అదుపులోకి తీసుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

ఇక్కడ చదవండి:

రాసలీలల కేసు: మంత్రితో అక్కడే తొలి పరిచయం

కొత్త ట్విస్ట్‌: ‘ఆ పని ఆయనే చేయమన్నాడు..’

మరిన్ని వార్తలు