రాసలీలల సీడీ కేసు: జార్కిహొళిని అరెస్టు చేయాలి

6 May, 2021 10:12 IST|Sakshi

సీడీ బాధిత యువతి డిమాండ్‌

బనశంకరి: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళీ రాసలీలల సీడీ కేసును వెనక్కి తీసుకోవాలని తమ న్యాయవాదిని ప్రలోభ పెట్టి ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆ కేసులో బాధిత యువతి ఆరోపించారు. తక్షణం మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళిని అరెస్ట్‌ చేయాలని బుధవారం బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్, సిట్‌ ఉన్నతాధికారి కవితలకు ఆమె లేఖ రాశారు.

తమ న్యాయవాదులు జగదీశ్‌కుమార్, సూర్య ముకుంద రాజ్‌లను కేసు వాదనల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని యువతి ఆరోపించారు. సాక్ష్యాల్ని నాశనం చేసి, కేసును వాపస్‌ తీసు కోవాలని జార్కిహొళి తీవ్ర ప్రయత్నాలు చేస్తు న్నారని చెప్పారు. 
చదవండి: ప్లీజ్‌.. సాయం చేయండి: హీరోయిన్‌ మొర

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు