గిటారులో డ్రగ్స్‌.. అంతా బాగానే కవర్‌ చేశాడు.. కానీ..

25 Nov, 2021 07:42 IST|Sakshi

దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్‌ దాచిన ఎలక్ట్రిక్‌ గిటార్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన వ్యక్తి ఎలక్ట్రిక్‌ గిటార్‌లోపల స్యూడో ఎఫెడ్రిన్‌ అనే మత్తుమందును ప్యాక్‌ చేసి తమిళనాడు తిరుచ్చిలోని కొరియర్‌ ఏజెన్సీలో కొరియర్‌ చేశాడు. అది ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. కెంపేగౌడ విమానాశ్రయంలో అధికారులు అనుమానంతో చెక్‌ చేయగా అందులో మత్తుమందు బయటపడింది. ఈ మత్తుమందు విలువ సుమారు రూ.50 లక్షలని అంచనా. 

మరో ఘటనలో...

లారీ ఢీకొని బైకిస్టు మృతి
తుమకూరు: లారీ ఢీ కొట్టడంతో బైకిస్టు మరణించాడు. ఈ ఘటన నగర శివార్లలో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగింది. గుబ్బి నుంచి తుమకూరు వైపు వస్తున్న బైక్‌ను ఎదురుగా మితిమీరిన వేగంతో వెళ్లిన లారీ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

చదవండి: స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత..

మరిన్ని వార్తలు