కొడుకు ఫెయిల్‌ అయ్యాడని తండ్రి ఆత్మహత్య

7 Jul, 2022 15:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: పదో తరగతి పరీక్షల్లో కొడుకు ఫెయిలయ్యాడని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈరోడ్‌ జిల్లా అంబాపేట సమీపంలో జరిగింది. వివరాలు.. అంబాపేట సమీపం కల్బావి తొట్టిపాళ్యెంకు చెందిన అప్పుస్వామి (45), సుమతి దంపతులకు సంజయ్‌ (15), చంద్రు ఇద్దరు కుమారులు ఉన్నారు. మైలంపాడి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సంజయ్‌ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిలయ్యాడు.

అప్పుస్వామి కుమారుడిని మందలించి ట్యూషన్‌కు పంపించాడు. అయితే సంజయ్‌ దాన్ని పట్టించుకోకపోవడంతో అప్పుస్వామి ఆందోళనకు గురయ్యాడు. పురుగుల మందు తాగి స్పృహ తప్పాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని ఈరోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడు. దీనిపై అంబాపేట పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు