నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. మోజు తీరాక ఇంట్లోనే ఒక్కదాన్నే వదిలేసి..

31 Mar, 2022 08:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీబీఎంపీ అధికారిపై ఫిర్యాదు

యశవంతపుర(బెంగళూరు): బీబీఎంపీ దక్షిణ విభాగం జాయింట్‌ కమిషనర్‌ వీరభద్రస్వామి పెళ్లి చేసుకొంటానని నమ్మించి మోసం చేశాడని ద్రిష్ట అనే మహిళ బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020లో పరిచయమయ్యాడని, భార్య నుంచి 11 ఏళ్లుగా దూరంగా ఉంటున్నట్లు చెప్పి తనను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడని తెలిపింది. 2022 ఫిబ్రవరి 14న హుళిమావు–బన్నేరఘట్ట మెయిన్‌ రోడ్డులోని చౌడేశ్వరి ఆలయంలో తామిద్దరం పెళ్లి చేసుకుని సంసారాన్ని ప్రారంభించామని ఫిర్యాదులో తెలిపింది. అకస్మాత్తుగా ఒకరోజు తనని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడని మళ్లి తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. ఇప్పుడు తానెవరో తెలియదు అని ముఖం చాటేశాడని, న్యాయం చేయాలని కోరింది. తాను ఫోన్‌ చేస్తే వీరభద్రస్వామి స్పందించడం లేదని పేర్కొంది.

మరో ఘటనలో..
బెకును ఢీకొన్న కారు, ఒకరి మృతి  
మైసూరు: కారు బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన పిరియా పట్టణం తాలూకా సిగూరు గ్రామం మెయిన్‌ రోడ్డులో బుధవారం జరిగింది. మృతుడిని  ఇదే తాలూకా వేలూరుకు చెందిన షడక్షరి స్వామి(35)గా పోలీసులు గుర్తించారు. ఈయన బైక్‌పై వెళ్తుండగా కేరళకు చెందిన కారు ఢీకొంది.  ప్రమాదంలో షడక్షరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు.

మరిన్ని వార్తలు