అమ్మాయి ఫోటో పెట్టి.. 50 మందికి వల

31 Jul, 2022 09:59 IST|Sakshi

యశవంతపుర: ఫేసుబుక్, ఇన్‌స్టాగ్రాంలో యువతి పేరుతో నకిలీ ఖాతా తెరిచి యువకులను మోసం చేసిన నిందితుడిని బెళగావి సీఇఎన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిప్పాణి తాలూకా నాయింగ్లాజ్‌ గ్రామానికి చెందిన మహంతేశ ముడసె దుబైలో ఉన్న బెళగావి యువతి ఫొటోను సేకరించి ఎం.స్నేహ పేరుతో ఫేసుబుక్‌లో నకిలీ ఖాతా తెరిచాడు. దాదాపు 50 మంది యువకులకు రిక్వెస్ట్‌ పంపి వారితో ఆడ గొంతుతో మాట్లాడుతూ స్నేహం చేశాడు.

అనేక మంది అతని వలలో పడి రూ.19 లక్షలు సమరి్పంచుకున్నారు. కాగా తన ఫొటో ఫేస్‌బుక్‌లో ఉండటాన్ని గమనించిన దుబైలోని యువతి... ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు మహంతేశ్‌ను అరెస్ట్‌ చేశారు.   

మరిన్ని వార్తలు