పనికి వెళ్లలేదని భర్తని మందలించింది.. ఇంటికి తిరిగి వచ్చేసరికి..

26 Nov, 2021 08:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి బెంగళూరు: భార్య మందలించడంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని కోటపాళ్యంలో క్రిష్ణప్ప(42) కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా పనులకు వెళ్లకపోవడంతో భార్య మందలించి బయటకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి భార్య మందలించిందనే బాధతో జీవితంపై విరక్తి చెందిన క్రిష్ణప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  తళి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటనలో..
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...ముగ్గురి మృతి 
బైక్‌ను కేఎస్‌ ఆర్టీసీ బస్సు ఢీ కొని ముగ్గురు మరణించారు. ఈ ఘటన చామరాజనగర  తాలూకా మరియాల బ్రిడ్జి వద్ద జరిగింది. చామరాజనగర నుంచి ముగ్గురు వ్యక్తులు బైక్‌పై బేడపురకు వెళ్తుండగా ఒక వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయిన ఆర్టీసీ బస్సు బైక్‌ ఢీ కొట్టినట్లు తెలిసింది. ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.  సంఘటన స్థలాన్ని పోలీసులు వచ్చి పరిశీలించారు. చామరాజనగర గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. 

చదవండి: బాలికతో ప్రేమ.. సోషల్‌ మీడియాలో పరిచయమై.. మాయమాటలు చెప్పి..

మరిన్ని వార్తలు