నీ అశ్లీల వీడియో లీక్‌ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు!

10 Jan, 2022 07:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి(కర్ణాటక): నీ అశ్లీల వీడియో నా వద్ద ఉంది, డబ్బులు ఇవ్వకపోతే లీక్‌ చేస్తానని మంత్రి కుమారున్ని బెదిరించాడన్న కేసులో ప్రముఖ జ్యోతిష్యుని కొడుకుని బెంగళూరు  సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ కుమారుడు నిశాంత్‌ను ఆర్‌టీ నగరలో ఉండే రాహుల్‌భట్‌ బెదిరించాడని, ఆదివారం అతన్ని అరెస్ట్‌ చేశామని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ రమణ్‌గుప్తా తెలిపారు.

ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అశ్లీల వీడియోను సృష్టించి మంత్రి పీఏలు శ్రీనివాసగౌడ, బానుప్రకాష్‌ల మొబైళ్లకు పంపి డబ్బుకు డిమాండ్‌ పెట్టారు. లేదంటే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బ్లాక్‌బెయిల్‌ చేశారని నిశాంత్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాహుల్‌భట్‌ను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: ఐఏసీ విక్రాంత్‌ మూడోదఫా జలపరీక్షలు ఆరంభం

మరిన్ని వార్తలు