అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్‌ కేసు: వెలుగులోకి కొత్తపేరు

11 Jan, 2022 07:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి (కర్ణాటక): మంత్రి సోమశేఖర్‌ కుమారుడు నిశాంత్‌ని అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో రాహుల్‌భట్‌తో పాటు సోమవారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సూత్రధారి ఎవరు అనేదానిపై  సీసీబీ పోలీసులు విచారణ చేప ట్టారు. ఇండి ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్‌ కుమార్తె పేరుతో ఉన్న సిమ్‌కార్డు నుంచి నిశాంత్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని తేలింది.

దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుమార్తె ఉన్నత విద్య కోసం గత 10 నెలలుగా విదేశాల్లో ఉందని, ఆమె సిమ్‌కార్డును రాకేశ్‌ అణ్ణప్ప అనే స్నేహితునికి ఇచ్చిందని, అతడు దానిని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.     

మరిన్ని వార్తలు