పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని.. రాత్రి పొలంలోకి వెళ్లి

11 Aug, 2023 12:11 IST|Sakshi

మైసూరు(బెంగళూరు): సాధారణంగా మనం దుస్తులు షాపింగ్‌ అంటేనే గంటల తరబడి సమయం తీసుకుంటుంటాం, అలాంటిది జీవితాంతం ఒకరితో కలిసుండాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఫాస్ట్‌ యుగంలో అంతా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనిపిస్తుందిఇటీవల కొన్ని వివాహాలు పీటల వరకు వచ్చి కొన్ని కారణాల వల్ల ఆగిపోవడమే అందుకు ఉదాహరణ.

తాజాగా వక్కతోటను దుండగులు ధ్వంసం చేసిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మనుగనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్‌ మూడు ఎకరాల్లో అల్లం, ఒక్కచెట్లు సాగు చేశాడు. ఈ క్రమంలో అతను నాటిన 850 మొక్కలను పెరికివేశారు. ఇదిలా ఉంటే బాధిత రైతు తన కుమార్తెను అశోక్‌ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయించాడు. అయితే అదే గ్రామానికి చెందిన అశోక్‌ ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన రాత్రి సమయంలో అశోక్‌ వక్కచెట్లను పెరికివేయించినట్లు బాధిత రైతు ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చదవండి: అమెరికాలో మోదీకి పాదాభివందనం.. ఇప్పుడు మణిపూర్‌పై కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు