10 వేలు చేతిలో పెట్టి.. కారుతో సహా ఉడాయించాడు

7 Aug, 2021 11:23 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ట్రయల్‌ చూస్తానని చెప్పి కారు అపహరించిన నిందితుడిని నెలమంగల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంజు (35) అరెస్టయిన నిందితుడు. బెంగళూరు కేకేహళ్లి నివాసి శివకుమార్‌ తన సోదరికి చెందిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు అమ్మకానికి పెట్టాడు. నెలమంగల నివాసి మంజు కారు కొనుక్కుంటానని ట్రయల్‌ చూడాలని కారు తీసుకురమ్మన్నాడు.

ఈ క్రమంలో శివకుమార్‌ మంజు మాటలు నమ్మి కారు తీసుకుని వచ్చాడు. అతడి చేతిలో రూ.10 వేలు నగదు పెట్టి ట్రయల్‌ చూస్తానని చెప్పి మంజు కారుతో పాటు పరారయ్యాడు. మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. దీంతో శివకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

చదవండి: బిగ్‌బీ బంగ్లా, మూడు రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్‌ కలకలం 

మరిన్ని వార్తలు