మంత్రి రాసలీలల వీడియోలు వైరల్‌

2 Mar, 2021 22:41 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ మంత్రి రాసలీలల వీడియో కలకలం రేపుతోంది. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అండగా ఉండాల్సిన కర్ణాటక ఇరిగేషన్‌ మంత్రి రమేష్‌‌ జర్కిహోలి ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

కాగా, యువతి డాక్యుమెంటరీ విషయమై కొద్ది రోజుల కిందట మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. అయితే సదరు మంత్రి ఆ యువతిని లొంగదీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా యువతితో మంత్రి చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

పోలీసులకు సామాజిక కార్యకర్త ఫిర్యాదు   
జలవనరుల మంత్రి రమేశ్‌ జార్కిహొళి సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక యువతిని లోబర్చుకున్నారని పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్‌ కల్లహళ్లి బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు ఆడియోను, వీడియో సీడీని అందజేశారు. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే ఒక యువతి రాష్ట్రంలోని డ్యాంలను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. అలా పరిచయమై శారీరక సంబంధం వరకూ వెళ్లిందని ఆరోపణ. ఆ రాసలీలల వీడియో పలు టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో సంచలనం చోటుచేసుకుంది. ప్రాణభయంతోనే ఆ యువతి తన సాయం కోరిందని దినేశ్‌ తెలిపారు. తాజా వ్యవహారం బీజేపీ సర్కారుకు సంకటంగా మారేలా ఉంది.

నేను తప్పు చేయలేదు: మంత్రి   
నేను ఏ తప్పు చేయలేదు, రాజీనామా చేయాల్సిన పనిలేదని మంత్రి జార్కిహొళి అన్నారు. వీడియో బహిర్గతం అయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరులో  మీడియా సమావేశం నిర్వహించారు. రాసలీలల వీడియో తను చూడలేదని, ఎవరో కుట్రలు చేస్తున్నారని చెప్పారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు