చిట్టితల్లి ఇక లేదు.. అందుకే..

15 Jun, 2022 06:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కెలమంగలం(బెంగళూరు): కడుపునొప్పి తాళలేక కూతురు ఆత్మహత్య చేసుకొంది. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న కూతురు ఇక లేదని కుమిలిపోయిన తల్లి, అమ్మ కూడా బలవంతంగా తనువు చాలించారు. ఇరువురూ రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకొన్న ఘటన తళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. తళి సమీపంలోని గుమ్మళాపురం గ్రామానికి చెందిన నరసింహన్‌ కూతురు అర్పిత (14) 9వ తరగతి చదివేది.

గత రెండు రోజుల క్రితం కడుపునొప్పి సమస్యతో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తళి పోలీసులు శవాన్ని స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవాన్ని తీసుకొనేందుకెళ్లిన అర్పిత తల్లి సుమిత్ర (32), అమ్మమ్మ రత్నమ్మ(60)లు ధర్మపురికి సోమవారం వెళ్లారు. అక్కడే కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకొన్నారు. రైలు దూసుకెళ్లడంతో మృతదేహాలు దూరంగా పడ్డాయి. ఈ ఘటనపై ధర్మపురి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. వరస ఆత్మహత్యలతో గుమ్మళాపురంలో విషాదం ఏర్పడింది.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: భువనగిరిలో దారుణం.. మహిళ నగ్న చిత్రాలు తీసి..

మరిన్ని వార్తలు