రూ.లక్షకి రెండు లక్షలు.. అట్లుంటది మనతోని..

21 May, 2022 08:53 IST|Sakshi

మండ్య(బెంగళూరు): రెట్టింపు నగదు ఇస్తామని వంచనకు పాల్పడుతున్న 8 మంది  పట్టుబడ్డారు. చామరాజ నగర జిల్లా కొళ్లెగాల తాలుకాలో శరగూరు గ్రామానికి చెందిన నంజుండరాద్య, బెంగళూరు దేవరజీవనహళ్లికి చెందిన శ్రీనివాస్, సలీమూల్లాఖాన్, యనగరకు చెందిన మంజునాథ్, ఎలక్ట్రానిక్‌సిటి శ్రీనివాస్‌ రెడ్డి, కోళ్ళెగాలలోని హరళె గ్రామానికి చెందిన తాజీజ్‌ అహ్మద్, దొడ్డబళ్లాపురకు చెందిన నాగరాజులను మద్దూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిందితులు  ఈనెల 3న తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకాకు చెందిన కిరణ్‌ కుమార్, అతని స్నేహితుడు ప్రదీప్‌లను సంప్రదించారు. రూ.లక్షకి రెండు లక్షలు, రూ. 5 లక్షలకి రూ. 10 లక్షలుగా అందజేస్తామని మాయమాటలు చెప్పి నగదు ఇప్పించుకొని ఉడాయించారు. 


మరో ఘటనలో..

నకిలీ జాగాల కిలాడీలు అరెస్ట్‌ 
యశవంతపుర: ప్రైవేట్‌ ఇళ్ల జాగాలకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి వంచనకు పాల్పడుతున్న ఆర్‌టీనగరకు చెందిన ఫైజ్‌ సుల్తానా, సహకార నగర శాంతివనకు చెందిన కబీర్‌ అలియాస్‌ బాబు, కల్పనా, యోగేశ్, పూజాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ. 2.87 లక్షలు నగదు, 102 గ్రాములు బంగారు నగలు, ఓ కారు, నకిలీ ఆధార్‌ కార్డు ఇతర పత్రా­లను స్వాధీనం చేసుకున్నారు.

డీసీపీ డాక్టర్‌ అనూప్‌శెట్టి శుక్రవారం  వివరాలు వెల్లడించారు.  బెంగళూరు నగరం­లోని నరసీపురకు చెందిన సువర్ణమ్మకు 1998లో హెచ్‌ఎంటీ లేఔట్‌లో ఇంటి స్థలం మంజూరైంది. స్థలాన్ని అమ్మినట్లు పత్రాలు ఉండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కబీర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని అరెస్ట్‌ చేశారు. కల్పనా, యోగేశ్, ఫైజ్‌ సుల్తా­నా పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి కొద్ది రోజుల తరువాత మరో వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి: అనుమానాలున్నాయి.. బాత్రూమ్‌లో పడింది, మంచం తగిలింది, ఉరేసుకుందని..

మరిన్ని వార్తలు