బాలిక హత్య.. మూడేళ్ల తరువాత..

14 Jun, 2022 08:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తుమకూరు(బెంగళూరు): కొరటిగెరె వద్ద గొరవనహళ్ళి లక్ష్మిదేవి అమ్మవారి ఆలయం సమీపంలో మూడేళ్ల కిందట  17 ఏళ్ల బాలికను హత్య చేసి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన కేసును ఇప్పటికి పోలీసులు ఛేదించారు. బెళగావికి చెందిన రూపేష్‌ (32) అనే నిందితున్ని అరెస్టుచేశారు. 2019లో రూపేష్‌ కారులో ప్రయాణిస్తుండగా బాలిక లిఫ్ట్‌ అడిగింది. ఆమె ఒంటిపై నగలు ఉండడంతో దుర్బుద్ధి పుట్టింది. ఆలయం వద్దకు వచ్చి బాలికను చంపి నగలు తీసుకున్నాడు. తరువాత ఆమె మృతదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి వెళ్లిపోయాడు. కొరటిగెరె పోలీసులు విచారణ జరిపి నిందితున్ని గుర్తించి అరెస్టు చేశారు.

మరో ఘటనలో..
దోపిడీకి యత్నం, అరెస్టు
కెలమంగలం: దోపిడీకి యత్నించిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఆదివారం సాయంత్రం అగ్గొండపల్లి ప్రాంతంలో ఒక వలస కార్మికుడు నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దుండగుడు అతన్ని కత్తితో బెదరించి సెల్‌ఫోన్, నగదును లాక్కొనేందుకు యత్నించాడు. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి దొంగను పట్టుకొని కెలమంగలం పోలీసులకు అప్పగించారు. విచారించగా అతడు వన్నలవాడికి చెందిన శివానందం లియాస్‌ కపాళి (25) అని తెలిసింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు