వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి

28 Nov, 2021 08:18 IST|Sakshi

శివాజీనగర(కర్ణాటక): కేంద్ర ప్రభుత్వ సర్వే శాఖలో డిప్యూటి కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వందలాది మందితో డబ్బు వసూలు చేసి మోసగిస్తున్న ఖతర్నాక్‌ వంచకున్ని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన రాఘవేంద్ర అరెస్ట్‌ అయిన నిందితుడు. ఇతడు ఉడుపిలో ప్రైవేట్‌గా సర్వేయర్‌గా పని చేస్తుండేవాడు.

చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్‌ స్తంభానికి కట్టేసి..  

తక్కువ కాలంలో ధనవంతున్ని కావాలని వక్రమార్గం పట్టాడు. 10 సంవత్సరాల కిందట బెంగళూరుకు వచ్చి కేంద్ర సర్వే శాఖలో డిప్యూటీ కమిషనర్‌ అని నకిలీ గుర్తింపు కార్డు చేయించుకొన్నాడు. కారుకు భారత ప్రభుత్వం అని బోర్డు వేసుకుని ప్రభుత్వ శాఖల్లో పని ఇప్పిస్తానంటూ మోసాలను ప్రారంభించాడు. ఎక్కువగా ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పెద్దసంఖ్యలో నిరుద్యోగుల నుంచి రూ.20 లక్షల చొప్పున వసూలు చేశాడు.

నాలుగు పెళ్లిళ్లు  
బెంగళూరు జే.పీ.నగరలో ఉంటున్న రాఘవేంద్ర హావేరి, బాగలకోట, బెంగళూరు, కుందాపురలో రహస్యంగా నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసి సంపాదించిన డబ్బుతో సొంతూరు సహా పలుచోట్ల ఫ్లాట్లు, నగలు, కార్లు కొన్నాడు. పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో మోసగాని బండారం బయటపడింది. అతనిని అరెస్టు చేసి నకిలీ గుర్తింపు కార్డు, మొబైల్‌ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, చెక్‌బుక్, బాండ్‌ పేపర్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. వివిధ జిల్లాల్లో నమోదైన ఫిర్యాదులపైనా విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు