కష్టపడి చదివాడు .. ఎన్నో కలలు.. కానీ కాలం అతన్ని దొంగగా మార్చింది

26 Nov, 2021 08:43 IST|Sakshi

రూ.15 లక్షల విలువైన బైక్‌లు స్వాధీనం 

బనశంకరి(బెంగళూరు): కష్టపడి చదివిన చదువుకు సరైన ఉద్యోగం లభించక ఒక డిప్లొమా హోల్డర్‌ చోరీల బాట పడ్డాడు. ఏపీలో బైక్‌లను చోరీ చేసి కర్ణాటకలో విక్రయిస్తూ బండెపాళ్య పోలీసులకు పట్టుబడ్డాడు. డిప్లొమా సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈ నిందితుడు ఎలాంటి ఉద్యోగం లభించకపోవడంతో బైక్‌ చోరీలను వృత్తిగా పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 కూడ్లుగేట్‌ వద్ద బైక్‌ విక్రయిస్తుండగా నిందితుడిని అరెస్ట్‌ చేసి అతని వద్దనుంచి రూ. 15 లక్షల విలువచేసే  5 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులు, 4 యమహా, బజాజ్‌ పల్సర్‌ బైకుతో పాటు మొత్తం 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతనిపై బెంగళూరు నగరంలో 5 కేసులు,  విజయవాడలో 1, బద్వేలు 2, తిరుపతి టౌన్‌ 2 కేసులతో కలిపి మొత్తం 10 కేసులు వెలుగు చూశాయి.

చదవండి: కలిసికట్టుగా కొట్టేశారు.. సినిమాలోనూ ఇలాంటి దొంగతనం చూసుండరు !

మరిన్ని వార్తలు