మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి అనేసరికి..

29 Sep, 2021 13:29 IST|Sakshi

బెంగళూరు: ఓ కేసు విషయమై బాలిక ఇంటికి కానిస్టేబుల్‌ వెళ్లి ఆమెకి మాయమాటలు చెప్పి లైంగికి దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో పెళ్లికి సేసేమిరా అనడమే గాక అబార్షన్‌ చేసుకోవాలని బలవంతం పెట్టాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం ... తన పెద్ద కుమార్తె అత్యాచారానికి గురైన కేసు విషయమై సమన్లు, ఇతర కోర్టు పేపర్‌లను ఇచ్చేందుకు కానిస్టేబుల్‌ శివరాజ్‌ నాయక్‌ తన ఇంటికి వచ్చేవాడని తెలిపాడు. 

కోర్టు ప్రొసీడింగ్‌లు పూర్తయిన తర్వాత కూడా, అతను ఏదో ఒక నెపంతో బాధితురాలి ఇంటికి వస్తూనే ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లోని మైనర్‌ బాలికను లొంగదీసుకున్నాడు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. ఇటీవల కుమార్తెలో మార్పును గమనించిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు వెళ్లి కానిస్టేబుల్‌ని నిలదీయడంతో అతను పెళ్లికి నిరాకరిస్తూ ఆమెను అబార్షన్ చేయించుకోవాలని సూచించాడు. అందుకు ఖర్చుల కింద ఆ కుటుంబానికి రూ.35,000 ఇచ్చాడు. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ శివరాజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

చదవండి: Bangalore Flyover Accident: అదే వంతెనపై మరో ఘోరం 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు