Karnataka Si Exam Scam: ఎస్‌ఐ స్కాంలో దంపతుల అరెస్టు

31 May, 2022 14:36 IST|Sakshi

బనశంకరి(బెంగళురు): రెండు నెలలుగా పరారీలో ఉన్న ఎస్‌ఐ కుంభకోణం నిందితులు శాంతి బాయి, బసయ్యనాయక్‌ దంపతులను సోమవారం సీఐడీ అధికారులు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అరెస్ట్‌చేశారు. శాంతిబాయి ఎస్‌ఐ పరీక్ష రాసి ఎంపికైంది. ఆమె, భర్త మరో ప్రధాన నిందితుడు మంజునాథ మేళకుందికి డబ్బులు ఇచ్చి అక్రమాలకు పాల్పడడంతో సులభంగా ఉత్తీర్ణురాలైందని సమాచారం. కేసు వెలుగులోకి రాగానే శాంతిబాయి దంపతులు హైదరాబాద్‌ కు వెళ్లి తలదాచుకున్నారు. వీరి కోసం రెండునెలల నుంచి సీఐడీ పోలీసులు గాలింపు చేపట్టారు. 


మరో ఘటనలో..

ఘరానా దొంగ అరెస్టు 
బనశంకరి: విలాసవంతమైన జీవనం కోసం చోరీలకు పాల్పడుతున్న దొంగను సోమవారం బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.18 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్‌ సాదిక్‌ పట్టుబడిన దొంగ. మంగళూరుకు చెందిన నిందితుడు బెంగళూరు సిటీమార్కెట్‌లో ఉన్న ఒక హోటల్‌లో క్లీనింగ్‌ పనిచేసేవాడు. జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతడు దొంగతనాల కేసుల్లో జైలు పాలై, విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడడం గమనార్హం.

చదవండి: Crime: కసాయి తల్లి...తన ఆరుగుపిల్లల్ని బావిలో పడేసి...

మరిన్ని వార్తలు