పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ.. కనిపించిన వారితో..

16 May, 2022 10:50 IST|Sakshi

బనశంకరి(బెంగళూరు): ఒంటిపై దుస్తులు లేకుండా ఉద్యానవనాల్లో సంచరిస్తూ పర్యాటకులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విదేశీ పర్యాటకున్ని ఆదివారం సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. జేమ్స్‌ అనే విదేశీయుడు  శివరామకారంత లేఔట్‌పార్కులో బట్టలు లేకుండా తిరుగుతుండగా స్థానికులు సమాచారం అందించడంతో సంపిగేహళ్లి పోలీసులు వచ్చి అతన్ని పట్టుకోబోయారు. దీంతో పోలీసులపై  దాడికి యత్నించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మరో ఘటనలో..
చిన్నారిని చిదిమేసిన టిప్పర్‌
మండ్య: మద్దూరు తాలూకా దుండనహళ్లిలో ఘోరం చోటు చేసుకుంది. టిప్పర్‌ ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన భూమిక (6) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొంది. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచింది. టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో జనం రోడ్డుపై ధర్నా చేసి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కెస్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: పదిరోజుల్లో తేజ పెళ్లి.. పెద్దలు పత్రికలు పంచుతుంటే..

మరిన్ని వార్తలు