‘నా భర్తకి నలుగురు భార్యలు, 11 ఏళ్ల నుంచి..’

18 May, 2022 10:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర(బెంగళూరు): బెంగళూరు ప్రత్యేక బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పీఎం బాబుపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి నలుగురు భార్యలు ఉన్నారని, 11 ఏళ్ల నుంచి తనకు చిత్రహింసలు పెడుతున్నాడని ఆమె  గిరినగర పోలీసులకు మొరపెట్టుకుంది. అనేక సార్లు స్టేషన్‌కు పిలిచి బుద్ధి మాటలు చెప్పినా అతనిలో ఎలాంటి  మార్పు రాలేదని చెప్పింది. న్యాయం చేయాలని కోరింది.

మరో ఘటనలో..
గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన 
క్రిష్ణగిరి: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నీటి కాల్వలు తెగిపోయి వరదనీరు గ్రామానికి చొరబడిందని సూళగిరి సమీపంలోని బత్తలపల్లి గ్రామస్థులు వేపనపల్లి ఎమ్మెల్యే కే.పి. మునిస్వామి ఫిర్యాదు చేశారు. ఆయన మంగళవారం సూళగిరి తాలూకా కురియనపల్లి పంచాయతీ చిన్నబత్తలపల్లి ప్రాంతంలో వర్ష బాధిత ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే వరదనీటి కాల్వల్లో చెత్తాచెదారాన్ని తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా ఆదేశిస్తానని అన్నారు. 

చదవండి: ‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’

మరిన్ని వార్తలు