తరచూ గొడవలు.. అత్త హత్య, కోడలు అరెస్టు

30 Jun, 2021 15:05 IST|Sakshi

ఆలయానికి వెళ్లొస్తూ దంపతులు మృతి

తుమకూరు/కర్ణాటక: శిర తాలూకాలోని ఉజ్జనకుంటె గ్రామానికి చెందిన సరోజమ్మ (65) ఈ నెల 24న తేదీన ఉదయం ఇంట్లో మంటల్లో చిక్కుకుని చనిపోయింది. ఇది ప్రమాదం కాదని, హత్య అని సరోజమ్మ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టి సరోజమ్మ కోడలు సుధామణి, ఆమె పరిచయస్తుడు శ్రీరంగప్పలను తావరకెరె పోలీసులు అరెస్టు చేశారు. అత్త కోడలు మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఈ కారణంతోనే పెట్రోలు పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.   

ఆలయానికి వెళ్లి వస్తూ...కారు ఢీకొని దంపతులు దుర్మరణం  
క్రిష్ణగిరి: ద్విచక్ర వాహనంలో ఆలయానికి వెళ్లి వస్తూ కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందిన ఘటన సూళగిరి సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకొంది. హోసూరు భారతి నగర్‌కు చెందిన మురళి (35), భార్య రాణి (30) ఉదయం హోసూరు నుండి ద్విచక్ర వాహనంలో కామనదొడ్డి సమీపంలోని దక్షిణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా కళ్లకురిచ్చి నుండి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో దంపతులు ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.     

మరిన్ని వార్తలు