వివాహేతర సంబంధం గుట్టురట్టు.. లాడ్జిలో గది అద్దెకు తీసుకుని..

19 Jul, 2022 19:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): వివాహితతో అక్రమ సంబంధం గుట్టురట్టు కావడం, ఆమె భర్త బెదిరించడంతో భయపడ్డ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. బెంగళూరు కురుబరహళ్లి నివాసి అరుణ్‌ (33) నెలమంగల పట్టణంలోని ఒక లాడ్జిలో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేటు కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అరుణ్‌ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలియడంతో బెదిరించాడు. అంతేకాకుండా భార్యతో ఫోన్‌ చేయించి మన ఇద్దరి పేర్లు రాసి ఆయన ఆత్మహత్య చేసుకుంటానని చెప్పించాడు. దీంతో భయపడిపోయిన అరుణ్‌ నెలమంగలకు వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి అరుణ్‌ ఒక్కడే జీవనాధారం కావడంతో కుటంబ సభ్యులు కన్నరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే

మరిన్ని వార్తలు