యువతికి గర్భం.. ఏప్రిల్‌ 8న వివాహానికి ఒప్పుకొని, తెల్లారేసరికి.. 

24 Apr, 2022 12:30 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిని రిమాండ్‌కు తరలించిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాప్రా, గాంధీనగర్‌కు చెందిన గడ్డం కార్తీక్‌ (24), అదే కాలనీకి చెందిన ఓ యువతి (21), కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దీంతో యువతి తనను వివాహాం చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేస్తుండటంతో తప్పించుకుని తిరుగుతున్నాడు.

ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలవడంతో కార్తీక్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ నెల 8న వివాహం చేస్తామని వారంతా ఒప్పుకున్నారు. తీరా మరుసటి రోజే ఇంటికి తాళం వేసుకొని పరారయ్యారు. కార్తీక్, అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వెతికిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు కాపాడారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా శనివారం కార్తీక్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.  చదవండి: (విషాదం: సంబంధాలు వస్తున్నాయి.. భూమి కొనడానికి ఎవరూ రాక..)

మరిన్ని వార్తలు