హీరోయిన్లపై కామెంట్స్‌ : సునిశిత్‌ అరెస్ట్‌ 

23 Jul, 2020 18:26 IST|Sakshi

హైదరాబాద్‌ : ప్రముఖ హీరోయిన్‌లు తన లవర్స్‌ అంటూ హంగామా చేస్తన్న సునిశిత్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సునిశిత్‌ యూట్యూబ్‌ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు తనకు తెలుసని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే వారి వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు కూడా చేశాడు. అసభ్య పదజాలంతో వారిని దూషించాడు.(పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి)

ఈ క్రమంలోనే సునిశిత్‌పై ఇబ్రహీంపట్నం, కీసర పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కీసర పోలీసులు తాజాగా సునిశిత్‌ అరెస్ట్‌ చేశారు. కాగా, తనపై అసత్య ప్రచారం చేస్తున్న సునిశిత్‌పై గతంలో హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెయిల్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. (ఆ వార్తలో నిజం లేదు: అమితాబ్‌ బచ్చన్‌)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు