కరోనా తీవ్రతతో మహిళ.. అంబులెన్స్‌లో అసభ్యకరంగా..

15 May, 2021 19:20 IST|Sakshi

కొచ్చి: కరోనాతో బాధపడుతున్న బాధితులకు తమకు తోచిన విధంగా కొందరు సాయంచేస్తుంటే.. మరికొందరు ఏమీ చేయలేని వారి నిస్సహాయతను అదునుగా తీసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కరోనాతో తీవ్రంగా బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌తో  ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురం జిల్లాలో ఆల‌స్యంగా వెలుగుచూసింది. ఎంఆర్ఐ సెంట‌ర్‌కు బాధితురాలిని త‌ర‌లిస్తుండ‌గా ఆమెపై అంబులెన్స్ అటెండెంట్ లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న ఏప్రిల్ 27న జ‌ర‌గింది. 

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరింత‌ల‌మ‌న ప‌ట్ట‌ణంలో బాధిత మ‌హిళ ఇటీవ‌ల‌ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. ఆమె ప‌రిస్థితి విష‌మం కావ‌డంతో ఏప్రిల్ 27న అంబులెన్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ల్యాబ్‌కు త‌ర‌లించమని వైద్యులు తెలిపారు. ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌లో అటెండెంట్‌గా ఉన్న ప్రశాంత్ తనను లైంగికంగా వేధించాడని ఆమె వైద్యులకి తెలిపింది. బాధితురాలు పరిస్థితి అప్పడు తీవ్రంగా ఉన్నందున ఘటన జరిగిన వెంటనే ఈ చర్య గురించి తెలపలేకపోయింది. ఆరోగ్యం మెరుగుప‌డిన అనంత‌రం గురువారం (మే 13) వైద్యుల‌కు ఈ విష‌యం వెల్ల‌డించింది. వైద్యులు పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో నిందితుడు ప్రశాంత్‌పై పోలీసుల ఫిర్యాదు నమోదు చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

( చదవండి: మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు