ఎక్సర్‌సైజ్‌ చేయడానికి టెర్రాస్‌ మీదకు వెళ్లి .. మాటల్లో పడి..

5 Aug, 2021 21:21 IST|Sakshi

తిరువనంతపురం: ఉదయంపూట తన సోదరుడితో కలిసి అపార్ట్‌మెంట్‌పై వ్యాయామం చేస్తున్న యువతి.. అనుకోకుండా అదుపుతప్పి కిందపడింది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొచ్చిలోని చిత్తోర్‌రోడ్డులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో 18 ఏళ్ల ఐరిస్‌రాయ్‌, ఆమె సోదరుడు అలస్‌తో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరు కూడా తమ అపార్ట్‌మెంట్‌లోని భవనం పైకి వెళ్లి ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తుంటారు. కాగా, ప్రతిరోజు మాదిరిగానే.. ఐరిస్‌రాయ్‌, తన సోదరుడితో కలిసి ఈ రోజు (గురువారం) ఉదయం​ వ్యాయామం చేయడానికి టెర్రాస్‌ పైకి వెళ్లింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి అక్కడ కొంచెం బురదగా ఉంది. ఆ టెర్రాస్‌కు పక్కన సెఫ్టీ వాల్స్‌కూడా లేదు. ఈ క్రమంలో.. ఆమె వ్యాయామం చేసి అలసిపోయి.. అక్కడే ఉన్న బెంచ్‌ మీద కూర్చుంది. సోదరుడితో కలిసి మాటల్లో పడి .. ఎత్తైన ప్రదేశంలో ఉన్న విషయాన్ని మర్చిపోయింది.

దీంతో ఒక్కసారిగా..  9వ అంతస్తు నుంచి ఐరిన్‌ రాయ్‌ కిందకు జారిపడింది. ఈ సంఘటనతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె అరుచుకుంటూ.. కిందపడింది. ఆమె ముక్కు,నోటిలో నుంచి రక్తం బయటకు వచ్చింది. దీంతో, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని కొచ్చి పోలీసు అధికారి విజయ్‌ శంకర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు