ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ని నమ్మి 300 కి.మీ వెళితే అఘాయిత్యం.. అశ్లీల వీడియోలు తీసి..

11 Sep, 2021 15:14 IST|Sakshi

కొచ్చి: ఇటీవల సమాజంలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే తెలిసిన వారే మోసం చేస్తున్న తరుణంలో ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఏకంగా 300 కిలోమీటర్లు వెళ్లింది. అలా వెళ్లడమే తన పాలిట శాపంగా మారింది. ఆమె నమ్మిన వ్యక్తి తనని మోసగించాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కేరళలోని కొల్లాంకు చెందిని ఓ యువతి దాదాపు రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కోజికోడ్‌కు చెందిన అనాస్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారడంతో అప్పటి నుంచి తరచూ వారు ఫోన్‌ ద్వారా మాట్లాడుకోవడం, మెసేజ్‌లు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల అనాస్‌ ఆ యువతిని కోజికోడ్‌కి రావాలని బలవంతంగా చేయగా అందుకు తను అంగీకరించి గురువారం వెళ్లింది. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకున్న ఆనాస్ ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆ ఫ్లాట్‌కి అతని ముగ్గురు స్నేహితులు కూడా వచ్చారు.

వారందరూ కలిసి ఆ యువతి చేత బలవంతంగా మద్యం తాగించడంతో పాటు డ్రగ్స్ కూడా ఇచ్చారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను వీడియోలు, ఫోటోలు కూడా తీసుకున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని గ్రహించి వారు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రి సమీపంలో వదులుతూ.. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు.

అయితే ఆస్పత్రి సిబ్బంది యువతిపై జరిగిన దారుణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధిత మహిళ నుంచి స్టేట్‌మెంట్, నిందితుడి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆనాస్‌ను అరెస్ట చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

చదవండి: అయ్యో భగవంతుడా.. పొట్ట కూటి కోసమని వెళ్తుంటే..


 

మరిన్ని వార్తలు