షాకింగ్‌ ఘటన: కన్నకొడుకే కాలయముడిలా కుటుంబ సభ్యులందర్నీ...

23 Nov, 2022 16:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒక  యువకుడు కుటుంబ సభ్యులందర్నీ హతమార్చాడు. ఈ షాకింగ్‌ ఘటన దక్షిణ ఢిల్లీలోని పాలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం...25 ఏళ్ల కేశవ్‌ గత రాత్రి కుటుంబ సభ్యులందర్నీగొంతు కోసి చంపేసినట్లు తెలిపారు. ఒక పదునైన ఆయుధంతో పలుమార్లు దాడి చేసి హతమార్చాడని వెల్లడించారు. మృతులు కేశవ్‌ నానామ్మ  దేవనా దేవి(75), తండ్రి దినేష్‌(50), తల్లి దర్శన, కూతురు ఊర్వశిగా గుర్తించారు. వారందరూ వేర్వేరు గదుల్లో విగత జీవులుగా పడి ఉన్నారు.

కేశవ్‌ తల్లిదండ్రులిద్దరు బాత్రుంలోనూ, చెల్లెలు, నానమ్మ వేర్వేరు గదుల్లో అతడి చేతిలో హత్యకు గురయ్యారని పోలీసులు చెప్పారు. గుర్గాన్‌లో ఉద్యోగం చేస్తున్న కేశవ్‌ ఒక నెలక్రితమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని, దీపావళి నుంచే ఇంట్లో ఉంటున్నాడని చెప్పారు. అతను డ్రగ్స్‌కు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు.

నిందితుడు గత రాత్రి సుమారు 10.30 గం.ల ప్రాంతంలో ఈ ఘటనకు ఒడిగట్టినట్లు చెప్పారు. అదే ఇంటిలో ఉంటున్న పక్కింటి వాళ్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే ఇంతలో కేశవ్‌ తప్పించుకునేందుకు పథకం వేస్తుండగా అతని బంధువులు అడ్డకోవడంతో తాము అతన్న అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

(చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్‌ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు)

మరిన్ని వార్తలు