రియల్టర్ భాస్కర్‌ హత్య కేసు: విచారణలో కీలక అంశాలు

13 Aug, 2021 13:12 IST|Sakshi

త్రిలోక్‌నాథ్ బాబా సన్నిహితులను విచారిస్తున్న పోలీసులు

ప్రతి పౌర్ణమి నాడు నెల్లూరు కావలి సముద్రతీరాన క్షుద్రపూజలు

సాక్షి, హైదరాబాద్‌: రియల్టర్ భాస్కర్‌ హత్య కేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. త్రిలోక్‌నాథ్ బాబా సన్నిహితులను పోలీసులు విచారిస్తున్నారు. ప్రతి పౌర్ణమి నాడు నెల్లూరు కావలి సముద్ర తీరాన క్షుద్ర పూజలు నిర్వహించినట్లు తెలిసింది. పౌర్ణమి నాడు అర్ధరాత్రి పూజలో సుమారు 80 మంది వరకు హాజరయినట్లు తెలిసింది. వారిలో రియల్టర్లు, భక్తులతో పాటు రాజకీయ నేతలు కూడా పాల్గొనట్టు సమాచారం. గత పదేళ్లుగా భాస్కర్‌రెడ్డి కూడా పూజల్లో పాల్గొన్నట్టు తెలిసింది. లావాదేవీల విషయంలో త్రిలోక్‌నాథ్‌, భాస్కర్‌రెడ్డి మధ్య వివాదం జరిగినట్లు సమాచారం.

కాగా, నగరంలో రియల్టర్‌ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు త్వరగతిన ఈ కేసులో పురోగతి సాధించారు. హత్య కేసులో కీలక నిందితుడు త్రిలోక్‌నాథ్‌ బాబాను మహరాష్ట్రలో సైబరాబాద్‌ పోలీసుల అదుపులో తీసుకున్నారు. ఆయనతోపాటు మరో నిందితుడు కార్తీక్‌ని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భాస్కర్‌రెడ్డి హత్యకు ముందు అతను తిన్న ఆహారంలో కార్తీక్‌ మత్తు మందు కలిపినట్లు దర్యాప్తులో తేలింది.

మరిన్ని వార్తలు