12 ఏళ్ల బాలికకు మాయమాటలు .. 7 నెలల గర్భవతి

3 Jul, 2021 07:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోక్సో కేసు నమోదు

సాక్షి, సత్తుపల్లిరూరల్‌: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ రమాకాంత్‌ శుక్రవారం తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. బాలిక ఏడు నెలల గర్భిణి అని తెలియడంతో సీఐ ప్రత్యేక చొరవతో వైద్య పరీక్షలు చేయించి ఆమెకు మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు, దుస్తులు, డ్రైఫ్రూట్స్‌ అందించారు.  

మరిన్ని వార్తలు