నిత్య పెళ్లికూతురు సుహాసినికి ఏకంగా దొంగల టీమే ఉంది!

17 Jul, 2021 13:27 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అనాథనని చెబుతూ పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తున్న కిలాడి లేడి నిత్య పెళ్లికూతురు సుహాసిని మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక సంవత్సరంలో సుహాసిని ఇద్దరిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మోసం చేస్తూ ఉంటుందని ఆమె చేతిలో మోసపోయిన బాధితుడు ‘సాక్షి’కి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్లాన్ ప్రకారం సుహాసిని ట్రాప్ చేసి మోసాలు చేస్తూ ఉందని పేర్కొన్నారు. సుహాసినికి దొంగల టీం ఉందని, తన లాగా సుహాసిని చేతిలో మోసపోయిన బాధితులు చాలా మందే ఉన్నారని తెలిపారు.

సుహాసిని మోసాలు తమకు తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోయిందని వెల్లడించారు. పారిపోయే ముందు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్లిందని తెలిపారు. తమ దగ్గర మొత్తం 16లక్షలు తీసుకొని వెళ్ళిందని, అదే సమయంలో మణుగూరు పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేస్తే కంప్లెట్ తీసుకులేదని పేర్కొన్నారు. సుహాసిని ఎపిసోడ్‌లో తమ కుటుంబం పూర్తిగా ఇబ్బందుల్లో పడిందని, తన ఎపిసోడ్ తర్వాత తిరుపతిలో సునీల్‌ అనే వ్యక్తి మోసం చేసిందన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు