పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ.. షాకింగ్ విషయం చెప్పిన వైద్యులు..

18 Mar, 2023 12:44 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలోని అర్బన్ అల్లిపురంలో విషాద ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ సడన్‌గా కుప్పకూలింది. అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మరణించినట్లు నిర్ధారించారు.

మృతురాలి పేరు రాణి. బంధువుల పెళ్లికి హాజరై ఊరేగింపులో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్పటిదాకా ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. రాణి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఊరేగింపును అర్ధాంతరంగా నిలిపివేశారు.
చదవండి: పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు