కానిస్టేబుల్‌తో ఎఫైర్‌.. మహిళ అరెస్టు

25 May, 2021 09:39 IST|Sakshi

సాక్షి, నాగోలు: తనను పెళ్లి చేసుకోలేదని కోపంతో నకిలి ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టించి బాధితుడి భార్యకు, అతని కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్న ఓ మహిళను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నాగోలు ప్రాంతంలో ఉండే ఎఆర్‌ కానిస్టేబుల్‌కు బండ్లగూడలో ఉండే అల్లూరి నేహా అలియస్‌ బ్లెస్సీ (33)తో జిమ్‌కు వెళ్లే సమయంలో పరిచయం అయింది. కొంతకాలం ప్రేమించున్నారు. అప్పటికే ఎఆర్‌ కానిస్టేబుల్‌కు పెళ్లి అయి భార్య ఉంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఎల్‌బీనగర్‌ పోలీసులకు నేహా ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు పోలీసులు కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి ఉద్యోగి కూడా పోయింది. బెయిల్‌ మీద బయటకు వచ్చిన అతనిపై, అతని కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్న నేహా నకిలీ ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టించి, కొత్త మొబైల్‌ నంబర్ల ద్వారా అసభ్యకర సందేశాలను పంపడం ప్రారంభించింది. దీంతో బాధితులు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ సీఐ ప్రకాష్‌ కేసు నమోదు చేసుకుని నేహాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితురాలు నేహా  

చదవండి: ‘ఇప్పుడే  వివాహం చేసుకోవడం ఇష్టం లేదు’
తిన్నది అరగడం లేదు సార్‌..అందుకే బయటకు వచ్చా.. 

మరిన్ని వార్తలు