మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్‌ కేసు

28 Jan, 2021 03:18 IST|Sakshi

సాక్షి, నంద్యాల: టీడీపీ నేత, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, విజయ పాల డెయిరీ మాజీ చైర్మన్‌ భూమా నారాయణరెడ్డి, భూమా వీరభద్రారెడ్డి, బాలీశ్వరరెడ్డిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ సీఐ మోహన్‌రెడ్డి బుధవారం  తెలిపారు. నంద్యాల మండలం చాబోలు పాల సొసైటీ అధ్యక్షుడు మల్లికార్జున ఈనెల 2వ తేదీన ఏవీ అపార్టుమెంట్‌ వద్ద ఉండగా వీరంతా కలసి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. 20రోజుల పాటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో తిప్పుతూ మల్లికార్జున చేత ఖాళీ తెల్ల కాగితాలు, రిజిష్టర్‌ కాగితాలపై సంతకాలు చేయించుకుని వదిలేశారు. ఈ ఘటనపై త్రీటౌన్‌పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మల్లికార్జున ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై 365, 384, 344, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. 

మరిన్ని వార్తలు