ఒక పెళ్లి.. రెండు బరాత్​లు.. ట్విస్ట్​ ఏంటంటే..

6 Jun, 2021 15:01 IST|Sakshi

లక్నో: కరోనా ఉధృతి కారణంగా అనేక రాష్ట్రాలలో లాక్​డౌన్​ విధించి, కఠిన నిబంధలను అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం వివాహలపై కూడా పడింది. అయితే, ఈ కరోనా కాలంలో జరిగిన అనేక పెళ్లిళ్లు సోషల్​ మీడియాలో తెగ వైరల్​గా మారాయి. తాజాగా, మరో వివాహం ఇలాగే వార్తల్లో నిలిచింది. 

వివరాలు.. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్​లో జరిగింది. ఎటా జిల్లాలోని సిటాన్ గ్రామానికి చెందిన ​మోహనీకి, ఫులాన్పూర్​ గ్రామానికి చెందిన బబ్లూతో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరి పెళ్లి వేడుకను బంధువుల మధ్య  సిటాన్​ గ్రామంలో ఎంతో వేడుకగా జరుపుతున్నారు.  ఇక్కడ ట్విస్ట్​ ఏంటంటే.. ఇదివరకే ఆ యువతి, హయత్​ నగర్​ ప్రాంతానికి చెందిన అజిత్​ అనే మరో యువకుడు  ఒకరినొకరు ఇష్టపడ్డారు. 

అయితే, వీరి ప్రేమకు యువతి పెద్దలు మాత్రం  అంగీకారం తెలపలేదు. ఈ క్రమంలో బబ్లూతో వివాహం జరిపించడానికి సిద్ధపడ్డారు.  ఈ విషయం తెలియగానే అజిత్​ తన బంధువులు, బ్యాండ్​, బరాత్​తో కలిసి వివాహం జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. కానీ అప్పటికే మోహనీకి బబ్లూతో వివాహం జరిగిపోయింది. అజిత్​ కుటుంబ సభ్యులు కాసేపు అక్కడ గందరగోళం సృష్టించారు. 

ఈ ప్రేమ వ్యవహరం తెలిసిన బబ్లూ తరపు వారు, వధువు కుటుంబ సభ్యులతో వాదనకుదిగారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరువురి బంధువులు తీవ్రంగా వాదించుకున్నారు. అయితే, కాసేపటికి రంగంలోకి దిగిన పోలీసులు, వధువు తండ్రి, మేనమామలను,  అజిత్​ కుటుంబ సభ్యులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని  తెలిపారు. 

చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్​.. వైరల్​ వీడియో


 

మరిన్ని వార్తలు