సిబీఐ అధికారినంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌.. ట్విస్ట్‌ ఏంటంటే..

6 Jul, 2021 15:33 IST|Sakshi

కోల్‌కతా: ఒక వ్యక్తి తాను.. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వేస్టిగేషన్‌ అధికారినంటూ చెప్పుకుంటూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నాడు. అది కాస్త వైరల్‌ గా మారింది. దీంతో అతడిని కలకత్తా పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు, సనాతన్‌ రే అనే వ్యక్తి కోల్‌కత్తా హైకోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఆయన గతకొంత కాలంగా తన ఫేస్‌బుక్‌లో.. తాను సిబీఐ అధికారినంటూ నకిలీ ప్రోఫైల్‌ తయారు చేశాడు. అంతటితో ఆగకుండా, సిబీఐ అధికారులకు మాత్రమే ఉండే నీలిరంగు టాగ్‌ను తన వాహనానికి పెట్టుకున్నాడు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్‌ స్టాండింగ్‌ కమిటీ కౌన్సిల్‌ లో పనిచేస్తున్నట్లు పోస్ట్‌ చేశాడు. 

ఈ పోస్ట్‌లు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో, కోల్‌కత్తా స్పెషల్‌ ఇన్వేస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌) సనాతన్‌రేను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, సనాతన్‌ రే హైకోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నట్లు బయట పడింది. దీంతో, సిబీఐ అధికారినంటూ మోసంచేశాడని సిట్‌ విచారణలో తెలింది. కాగా, సిట్‌ అధికారులు, సనాతన్‌రే పై..  ప్రభుత్వాధికారినంటూ మోసం చేయడం, ఫోర్జరీ, నేర పూరిత చర్య వంటి పలు అభియోగాల కింద కేసులను నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు