యువతి పై సామూహిక అత్యాచారం.. ఆపై 15 లక్షలు దోపిడీ

8 Jul, 2021 12:00 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. నగరంలో గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లోకి ముగ్గురు దుండగులు చొరబడి 26 ఏళ్ల  యువతి పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆనంతరం ఆమె  ఇంట్లో ఉన్న రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన పై బాధితరరాలు గార్డెన్‌ రీచ్‌  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి  వైద్య పరీక్షలు నిర్వహించారు. 

వైద్య పరీక్షలు  అనంతరం అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇది ఆమెకు తెలిసిన వారే చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. అత్యాచారానికి ముందు యువతిని కట్టేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కోల్‌కతా డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు