వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు 

2 Jul, 2021 09:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: యువతులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతున్న ముఠాలోని ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీఫేజ్‌ –1లోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం యాంటి హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ టీంతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులు దాడులు నిర్వహించారు. గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఆనంద్‌ (22), కేపీహెచ్‌బీకాలనీ ధర్మారెడ్డి కాలనీకి చెందిన మేకల కృపాకర్‌(29)లను అరెస్టు చేశారు. బాధితురాలిని రీహాబిలేషన్‌ సెంటర్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరికి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

చదవండి: నేరేడ్‌మెట్‌: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం

మరిన్ని వార్తలు