మహిళ దౌర్జన్యం: ఇంటి తాళం పగలగొట్టి మరి..

9 Apr, 2021 14:38 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించినందుకు దాడి చేసి గాయపరిచాడంటూ ఓ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని షాంగ్రిల్లా ప్లాజాలో విష్ణుకాంత్‌ పూతలపట్టు అనే వ్యక్తి గతేడాది తన ప్లాట్‌ను గంటా మాణిక్యవీణకు విక్రయించేందుకు రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఆమె మిగతా మొత్తాన్ని ఇవ్వకపోగా ఒప్పందాన్ని కూడా అమలు చేయలేదు.

ఈ నేపథ్యంలోనే ఆయన రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా బుధవారం రాత్రి మాణిక్య వీణతో పాటు ఆమె భర్త రాహుల్, మరో 15 మంది తాళం వేసి ఉన్న ప్లాట్‌ తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తుండగా యజమాని అడ్డుకున్నారు. దీంతో అతడిపై వారు దాడి చేశారు. అందులో ఒకరు అతడిపై సుత్తితో దాడి చేయగా చెవి తెగిపడింది. బాధితుడు ఇ‍చ్చిన ఫిర్యాదు మేరకు మాణిక్య వీణతో పాటు రాహుల్, మరో గుర్తుతెలియని 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

( చదవండి: ఐదుగురు ఎస్సైలను మోసం చేసిన కి‘లేడీ’ మరో అవతారం )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు